TG: గాంధీ ఆసుపత్రిలో(HYD) బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని పల్లవి అనుమానాస్పదంగా మృతి చెందింది. అనారోగ్యంతో ఈనెల 16న చేరిన ఆమెకు 17న కణితి తొలగింపు సర్జరీ చేశారు. పరిస్థితి విషమించడంతో 20న మరోసారి ఆపరేషన్ చేశారు. అర్థరాత్రి పల్లవి చనిపోవడంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.