AP: రాష్ట్రంలో ప్రైవేట్ వర్సిటీల కమిటీని నిపుణులతో పునర్ వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ అధ్యక్షత వహించే ఈ కమిటీకి ఉన్నత విద్యాశాఖ కన్వీనర్‌గా ఉంటుంది. ఇందులో విశ్రాంత IRS అధికారి శ్రీనివాసులు, IIPE విశ్రాంత డైరెక్టర్ VSRK ప్రసాద్, బిట్స్ ప్రొఫెసర్ VS రావు, పారిశ్రామికవేత్త సురేష్ చిత్తూరి సభ్యులుగా నియమితులయ్యారు.