BHPL: రేగొండ మండలం బాగిర్తిపేట గ్రామానికి చెందిన ఎండీ యాకూబ్ పాషా వడదెబ్బతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న BJP మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెన్నంపెళ్లి పాపన్న మృతుడి నివాసానికి వెళ్లి ఆయన పార్దివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో BJP నాయకులు తదితరులు ఉన్నారు.