MLG: ధాన్యం రవాణాలో లారీల కొరత కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చొరవ తీసుకుంది. లారీ యజమానులు, అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరపగా శుక్రవారం స్వచ్ఛందంగా 65 లారీలను అందించేందుకు ముందుకొచ్చారు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న వరి, మొక్కజొన్నను త్వరితగతిన మిల్లులకు తరలించి రైతులకు ఊరట కల్పించనున్నారు.