SKLM: జిల్లాలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం కారణంగా మరో 4 రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో స్వల్ప విద్యుత్ అంతరాయాలు చోటుచేసుకునే అవకాశం ఉందని ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఇది విద్యుత్ కోత కాదని, సాంకేతిక కారణాల వల్లే తాత్కాలిక ఇబ్బందులు వస్తున్నాయని స్పష్టం చేశారు. ప్రజలు సహకరించాలని కోరారు.