JN: జనగామ సోషల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థి సృజన్ తన అద్భుత ప్రతిభతో DCP రాజమహేంద్ర నాయక్ చిత్రపటాన్ని పెన్సిల్తో గీశాడు. శుక్రవారం డీసీపీ కార్యాలయంలో DCPకి చిత్రపటాన్ని అందజేశాడు. చిత్రాన్ని పరిశీలించిన డీసీపీ ఆయన ప్రతిభను మెచ్చుకుని, చదువుతో పాటు చిత్రలేఖనంలో మరింత రాణించాలని సూచించారు. అవసరమైన సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.