SKLM: పారిశుధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శుక్రవారం జలుమూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సర్పంచుల పదవీకాలం ముగియడంతో గ్రామాల్లో పారిశుధ్య పనులపై అధికారులు, ఎంపీటీసీలు దృష్టి పెట్టాలన్నారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.