కోనసీమ: అమలాపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ‘ప్రజాదర్బార్’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి సమస్యలను ఎమ్మెల్యేకి స్వయంగా విన్నవించుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు.