PPM: గుమ్మలక్ష్మీపురం మండలం డుమ్మంగి గ్రామంలో ఇవాళ వారపు సంతను రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు కడ్రక మల్లేశ్వరావు ప్రారంభించారు. మాజీ సర్పంచ్ పాలక క్రాంతి కుమార్, తహసీల్దార్ నిమ్మక శేఖరం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పరిసర పది పంచాయతీల ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా ప్రతి శుక్రవారం సంత నిర్వహిస్తామని తెలిపారు.