అన్నమయ్య: పుల్లంపేట మండలం దొండ్లోపల్లి సమీపంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ పరిసర ప్రాంతంలో సంచరిస్తున్న జింకపై వీధి కుక్కలు గుంపుగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు జింకను పరిశీలించి, అనంతరం పోస్టుమార్టంకు తరలించారు.