కృష్ణా: కొండపల్లి మున్సిపాలిటీ 24వ వార్డు భీమరాజు గుట్టలో కాలువలు పొంగి మురుగునీరు రోడ్డుపైకి వస్తోంది. చేతి బోరు పక్కనే మురుగు నిలవడంతో తాగునీరు కలుషితం అవుతుందని స్థానికులు తెలిపారు. దోమలతో రోగాలు వస్తున్నాయని వారు వాపోతున్నారు. వెంటనే శుభ్రం చేయాలని అధికారులను కోరుతున్నారు. అధికారులు స్పందించకుంటే నిరసనకు దిగుతామని తెలియజేశారు.
Tags :