అల్లూరి: జిల్లాలో మాతాశిశు సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ నిశాంతి వైద్యాధికారులను ఆదేశించారు. ప్రసవ సమయాల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టరేట్లో గురువారం అధికారులతో వీసీ నిర్వహించారు. గర్భిణులను గుర్తించి, వారి ఆరోగ్యంపై పర్యవేక్షణ చేయాలన్నారు.