SRD: మున్సిపాలిటీలో రోడ్డుపై ఎవరైనా చెత్త వేస్తే రూ. 5 వేల జరిమానా విధిస్తామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ఇంటికి వచ్చే స్వచ్ఛ ఆటోలోనే తడి, పొడి చెత్త వేరువేరుగా వేయాలని సూచించారు. రోడ్డుపై చెత్త వేసే వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.