అన్నమయ్య: మదనపల్లె పట్టణ శివారులోని చంద్రా కాలనీకి చెందిన రత్నమ్మ(40) కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురై గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆటోలో జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.