HNK: హసన్పర్తి మండలం దేవన్నపేటకు చెందిన పెయింటర్ వంశీ (30) వడదెబ్బకు గురై మృతి చెందాడు. బుధవారం రోజంతా ఎండలో పని చేసిన వంశీ రాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గురువారం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే క్రమంలోనే అతను ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు వంశీకి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.