KMR: మైనర్ బాలికను ప్రేమ పేరుతో వంచించి, ఢిల్లీకి అపహరించి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు రహీంకు కామారెడ్డి ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20 సంవత్సరాల కారాగార శిక్ష, రూ. లక్ష జరిమానా విధించింది. తాడ్వాయి పోలీసులు సమగ్ర దర్యాప్తుతో పక్కా సాక్ష్యాధారాలు సమర్పించి నేరాన్ని నిరూపించారు. పోలీస్ అధికారులను కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు.