KRNL: నగర పరిధిలో అనధికారిక లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి LRSకు దరఖాస్తు చేసుకున్న వారి కోసం నేడు నగరపాలక సంస్థ న్యూ కౌన్సిల్ హాల్లో LRS మేళా నిర్వహించనున్నట్లు ఇన్ఛార్జ్ కమిషనర్ ఆర్జీవీ కృష్ణ తెలిపారు. సాయంత్రం 6 వరకు నిర్వహించే ఈ మేళాలో LRS దరఖాస్తులకు సంబంధించిన చెల్లింపులు, అప్రూవల్ ప్రొసీడింగ్స్ తదితర అంశాలన్నీ ఒకేచోట పరిష్కరించుకోవచ్చన్నారు.