MDK: రామాయంపేట తోనిగండ్ల, లక్ష్మాపూర్ గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ రజనీకుమారి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్రాల్లో కొనుగోళ్లు దాదాపు పూర్తయ్యాయని, వారం రోజుల్లో వీటిని మూసివేస్తామన్నారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు లేవని, అంతా ప్రశాంతంగా సాగుతోందని తహసీల్దార్ తెలిపారు.