SRD: కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాల మేరకు, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై జిల్లా స్థాయి సమావేశం ఈ నెల 22వ తేదీన కందిలోని లక్ష్మీనరసింహ గార్డెన్లో ఉదయం 11 గంటలకు నిర్వహించబడుతుంది. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు, అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ సూచించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.