BHNG: గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఇవ్వాళా ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ దేవనబోయిన ఐలయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ మాట్లాడుతూ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత సౌకర్యాలు అందిస్తున్నామని తెలిపారు.