TG: రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకూ ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. అసలే ఎండ తీవ్రత అంటే.. అందుకు వడగాల్పులు కూడా తోడవ్వడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. ఏకంగా 20 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మార్కును దాటడం అందరినీ కలవరపెడుతోంది.