BDK: దమ్మపేట(M) గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో ఈరోజు భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి నిర్వహించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశాన్ని ఆధునిక సాంకేతిక రంగంలో ముందుకు తీసుకెళ్లడంలో రాజీవ్ గాంధీ పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు.