కడప జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ కడప విమానాశ్రయానికి ఇవాళ చేరుకున్నారు. ఆయనకు జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవిత, కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నచికేత్, జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజక వర్గ ఇంఛార్జులు, తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన కార్యకర్తల సమావేశానికి ఆయన బయలుదేరారు.