NRML: సెర్ప్ ఉద్యోగులుగా గుర్తింపు, కనీస వేతనం రూ. 20 వేలు, ఉద్యోగ భద్రత తదితర డిమాండ్లతో వీవోఏలు మే 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు గురువారం తెలిపారు. డిమాండ్లు నెరవేరే వరకు మహిళా సంఘాలకు సంబంధించిన రుణాల రికవరీలు, కొన్ని ఆన్లైన్ సేవలను నిలిపివేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్వరం మండల ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.