KNR: గంగాధర మండలం బూరుగుపల్లి రైతు వేదికలో గురువారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఆర్ఎర్ఎస్ పొలాస శాస్త్రవేత్తలు స్వాతి, ఎంఏవో శ్రీనివాస్ పాల్గొని రైతులకు వరి సాగు, తక్కువ యూరియా వినియోగం, పంటల మార్పిడి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయం, పురుగు, తెగుళ్లు, కలుపు మందుల సమర్థ వినియోగంపై సూచనలు ఇచ్చారు.