PDPL: కమాన్ పూర్ మండల కేంద్రంలోని అంగడి బజారులో శ్రీలక్ష్మి, భూలక్ష్మి సహిత బొడ్రాయి 3వ వార్షికోత్సవం గురువారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. వేదమంత్రోచ్చారణల నడుమ దేవతామూర్తులకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.