ASR: జీకేవీధి మండలం దారకొండ ఘాట్ రోడ్డులో గురువారం సాయంత్రం ప్రమాదం చోటుచేసుకుంది. అంగన్వాడీ కేంద్రాలకు పాల ప్యాకెట్లు తీసుకెళ్తున్న బొలెరో పికప్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. వాహనంలో ముగ్గురు ప్రయాణిస్తుండగా ఒకరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.