PPM: జీవనశైలి వ్యాధులైన రక్తపోటు, మధుమేహం అదుపులో ఉండాలని లేకపోతే ఆరోగ్యానికి నష్టం వాటిల్లుతుందని DMHO డా. ఎస్. భాస్కరరావు పేర్కొన్నారు. పార్వతీపురం ఆర్టీసీ డిపోలో ఉద్యోగులకు గురువారం వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎన్.సి.డి పరీక్షలు నిర్వహించారు. వైద్య అధికారులతో కలిసి డీఎంహెచ్వో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.