E.G: మధురపూడి బస్ స్టాప్ వద్ద ఇటీవల గుర్తుతెలియని వృద్ధ మహిళ అపస్మారక స్థితిలో పడి ఉంది. దీన్ని గమనించిన స్థానికులు రాజమండ్రి 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. అచూకీ తెలిసిన వారు ఈ నంబర్లకు 94409 04831, 94409 04829 తెలపాలని కోరుకొండ సీఐ మూర్తి తెలిపారు.