ఉప్పల్ వేదికగా రేపు జరగనున్న SRH, RCB మ్యాచ్ టికెట్ల బ్లాక్ మార్కెట్ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సామాన్యులకు టికెట్లు దక్కకుండా, SM వేదికగా బ్లాక్‌లో అమ్ముతున్న ముఠాపై 10 కేసులు నమోదు చేశారు. కోహ్లీ క్రేజ్‌తో విపరీతమైన డిమాండ్ ఉన్న ఈ చివరి మ్యాచ్ టికెట్లను నిమిషాల్లో మాయం చేసి, వేల రూపాయలకు అమ్ముతుండటంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.