WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్నాయి. బుధవారం 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, నేడు 46 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వడగాల్పుల కారణంగా రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు, కూలీలు తగిన జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు.