KMR: తాడ్వాయి మండలం ఆంధ్రిల్ శివారంలో రైతు హనుమంతు సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు. పంట ఎదుగుదలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, సాంప్రదాయ పంటల కంటే ఆయిల్ పామ్ ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చన్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల సాయంతో ముప్పై ఏళ్ల పాటు స్థిరమైన లాభాలు లభిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు.