వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీవారి సర్వదర్శన క్యూలైన్లలోకి భక్తులను అనుమతించడం లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. బాట గంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లలోనే భక్తులు వేచి ఉన్నారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. రేపు ఉదయం 6 గంటలకు క్యూలైన్లోకి రావాలని ప్రకటన విడుదల చేసింది.