SRCL: జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను అత్యంత ప్రాధాన్యంగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయం నుంచి సెర్ప్ సీఈవో దివ్యతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.