ASR: డుంబ్రిగుడ మండలం బొడ్లమామిడి రహదారి భారీ వర్షాలకు కోతకు గురైంది. బొడ్లమామిడి, నిట్టమామిడి గ్రామాలకు రూ.2 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో వేసిన మెటల్, మట్టి వర్షాలకు కొట్టుకుపోయాయి. దీంతో రహదారి దెబ్బతిని వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే రోడ్డును మరమ్మతు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.