BHNG: ఆలేరు మండలం కొలనుపాకకు చెందిన మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బుధవారం నిర్వహించిన నూతన కమిటీ ఎన్నికల్లో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతమే లక్ష్యంగా సమిష్టి భావంతో పనిచేయాలని సూచించారు.