ADB: జిల్లాలో జొన్న, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు సకాలంలో చెల్లింపులు అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.