TG: గంజాయి అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్లోని ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేశారు. ఉప్పల్ శాంతినగర్ మై ఫీల్ రెస్టారెంట్ ప్రాంతంలో ఒరిస్సాకు చెందిన సుమన్ పాల్, అశోక్ బిస్వాస్, బిపుల్ బిస్వాస్ గంజాయి అమ్మకాలు జరుపుతున్నారని విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు ఎస్టీఎఫ్ టీమ్ దాడి చేయగా 3.8 కేజీల ఎండు గంజాయి పట్టుబడింది. వారి వద్ద నుంచి మూడు సెల్ ఫోన్లు, జైలో కారును స్వాధీనం చేసుకున్నారు.