ELR: ఏలూరులోని తూర్పు వీధి గౌరీ దేవి గుడి వద్ద ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై ఉల్లిపాయ బాంబులు తీసుకెళ్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి గోతుల పడగా బాంబులు పేలి బండిపై వెనకాల కూర్చున్న సుధాకర్ అనే వ్యక్తి అక్కడక్కడ మృతి చెందాడు. చుట్టుపక్కల ఉన్న మరో ఐదుగురు వ్యక్తులు తీవ్ర గాయాలు పాలయ్యారు. పోలీసులు విచారణ చేపట్టారు.