పండగపూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో 6గురు మృతి చెందగా 5గురు గాయపడిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. మీరట్ హైవేపై వెళ్లున్న టెంపోను ట్రాక్టర్ ఢీకొట్టడంతో అందులో ఉన్న 6గురు మృతి చెందారు. అనంతరం వచ్చిన కారు డివైడర్ను ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 5గురు గాయపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.