JN: ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలపాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం, ఇతర అంశాలపై జనగామ కలెక్టరేట్లో అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. అర్హులైన పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లును మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.