ఈ దసరా బాక్సాఫీస్ వార్ చిరంజీవి, నాగార్జున మధ్య జరగబోతున్న సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతికి మాత్రం ముగ్గురు హీరోల మధ్య పోటీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అసలు సంక్రాంతి అంటేనే.. బాక్సాఫీస్ వార్ ఓ రేంజ్లో ఉంటుంది. దాంతో వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ హీట్ ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’.. జనవరి 12న సంక్రాంతి బరిలో దిగడానికి ఫిక్స్ అయిపోయింది. రామాయణ గాథ ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి.
దాంతో సంక్రాంతి రేసులో ఇంకెవరు నిలుస్తారనే ఆసక్తి అందరిలోను ఉంది. గత కొద్ది రోజుల క్రితమే మెగాస్టార్ 154 ప్రాజెక్ట్ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. దాంతో 12నే రిలీజ్ చేస్తారా.. లేక రెండు మూడు రోజుల గ్యాప్‌తో విడుదల చేస్తారా అనేది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. బాబీ దర్శకత్వంలో మెగా మాసివ్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ సినిమా పై కూడా భారీ అంచనాలున్నాయి. ఇక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘వారసుడు’ కూడా సంక్రాంతి బరిలో దిగేందుకు సై అంటోంది. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ మూవీకి తెలుగులో భారీగానే క్రేజ్ ఉంది. దాంతో ఈసారి సంక్రాంతి వార్ ముగ్గురు హీరోల మధ్య నెక్ట్స్ లెవల్లో ఉండబోతోందని చెప్పొచ్చు.