»Bandi Sanjay Comments On Kcr For Vemulawada Rajanna Temple Development
Bandi Sanjay: కేసీఆర్ దేవుడికే శఠగోపం పెట్టిండు
కేసీఆర్ శివుడికే శఠగోపం పెట్టిండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. వేములవాడ రాజన్న ఆలయానికి వస్తున్న లక్షల మంది భక్తలకు కనీస సౌకర్యాలు లేవని నిలదీశారు. ప్రతి సంవత్సరం ఈ ఆలయానికి 100 కోట్ల రూపాయలు ఇస్తానన్న మాటను కేసీఆర్ నిలబెట్టుకోలేదన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్(cm kcr) దేవుడికే శఠగోపం పెట్టిండని బీజేపీ(bjp) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay)ఆరోపించారు. వేములవాడ రాజన్న ఆలయాని(vemulawada rajanna temple)కి ప్రతి ఏటా 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తానని ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. మరోసారి కేసీఆర్(kcr) మాట తప్పి శివుడిని మోసం చేశారని వ్యాఖ్యానించారు. మరోవైపు ఆలయానికి వచ్చిన లక్షల మంది భక్తులకు కనీస సౌకర్యాలు కూడా లేవని గుర్తు చేశారు. భక్తులకు తాగేందుకు నీరు సహా దివ్యాంగులు, వృద్దుల కోసం అసలు సౌకర్యాలే లేవన్నారు. రాత్రి 12 గంటలకు వచ్చిన భక్తులు సైతం అనేక సమయం లైన్లలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తిందని వెల్లడించారు. మహా శివరాత్రి(maha shivaratri) పండుగ సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయాన్ని బండి సంజయ్(Bandi Sanjay) దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు.
ఇటీవల కొండగట్టు(kondagattu)కు వచ్చిన కేసీఆర్ దగ్గరలో ఉన్న వేములవాడ(vemulawada)ను ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వకుండా ఇక్కడి డబ్బులు మాత్రం ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్(kcr) కావాలనే వేములవాడ ఆలయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రసాద్ స్కీం ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపితే నిధులు తీసుకొస్తానని అనేక సార్లు చెప్పినా కూడా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. దీంతోపాటు కొండగట్టు(kondagattu), ధర్మపురి ఆలయాల అభివృద్ధి కోసం కూడా ప్రతిపాదనలు పంపాలని అడిగినట్లు వెల్లడించారు. శివుడు అన్ని చూస్తున్నాడని, ఈ మూర్ఖపు కేసీఆర్ పాలన పోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాజన్న ఆలయం కోసం కేసీఆర్ రూ.10 కోట్లు కూడా ఖర్చుచేయలేదన్నారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం(delhi liquor scam)లో నాలుగు సార్లు నీ బిడ్డ పేరు వచ్చిందని గుర్తు చేశారు. ఇక నీ బిడ్డకు దొంగసార దందాలో ఎంత వాటా ఉందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఢిల్లీ ఉపముఖ్యమంత్రికి సీబీఐ నోటీసులు ఇచ్చిందని, నీ బిడ్డకు కూడా ఏం జరగాలో అదే జరుగుతుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.