»Metro Md Nvs Reddy Said To Shamshabad Route Mindspace Is A Very Difficult Task
Metro MD NVS Reddy: శంషాబాద్ కు మెట్రో చాలా కష్టమైన పనే
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రో నిర్మాణం క్లిష్టమైన సమస్యగా మారిందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెబుతున్నారు. మెట్రోలైన్ నిర్మించే రాయదుర్గం స్టేషన్ నుంచి నానక్ రామ్ గూడ జంక్షన్ వరకు చేపట్టనున్న ఇంజినీరింగ్ వర్క్ ఇబ్బందిగా మారుతుందన్నారు. సుమారు 21 మీటర్ల ఎత్తులో మైండ్ స్పేస్ జంక్షన్ దాటడం కష్టతరమని అంటున్నారు. ఆ క్రమంలో ఫ్లై ఓవర్, అండర్ పాస్, మధ్యలో రోటరీ వంటివి అడ్డుగా ఉన్నాయని వెల్లడించారు.
హైదరాబాద్(hyderabad) శంషాబాద్ ఎయిర్ పోర్టు(Shamshabad airport)కు మెట్రో నిర్మాణం కష్టమైన పని అని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి(Metro md nvs reddy )అంటున్నారు. మెట్రోలైన్ నిర్మించే రాయదుర్గం స్టేషన్ నుంచి నానక్ రామ్ గూడ జంక్షన్ వరకు చేపట్టనున్న ఇంజినీరింగ్ వర్క్ చాలా క్లిష్టతరమైందని వెల్లడించారు. దాదాపు 21 మీటర్ల ఎత్తులో మైండ్ స్పేస్(mindspace) జంక్షన్ దాటడం కష్టతరమైన పని అన్నారు. ఆ క్రమంలో ఫ్లై ఓవర్, అండర్ పాస్, మధ్యలో రోటరీ వంటివి అడ్డుగా ఉన్నాయని చెప్పారు.
ఈ క్రమంలో ప్రత్యామ్నాయ పరిష్కారాల గురించి ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. దీంతోపాటు అనేక ఇబ్బందులు ఉన్నట్లు తెలిపారు. మరోవైపు శంషాబాద్(Shamshabad) ఎయిర్ పోర్ట్ మెట్రో కోసం పిల్లర్లు దూరం దూరం నిర్మించాల్సి ఉంటుంది. ఆ క్రమంలో ఇటీవల పలువురు అధికారులు ఆ రూట్ మ్యాప్(route map) మార్గాన్ని పలు మార్లు పరిశీలించినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సంబంధింత అధికారులతో రూట్ మ్యాప్ అంశంపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఆయా మార్గాల్లో మెట్రో నిర్మించేందుకు పలు రకాల సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుందని ఎన్వీఎస్ రెడ్డి అంటున్నారు.
ఇప్పటికే రెండో దశ(second phase) మెట్రో నిర్మాణానికి డిసెంబర్ 9న రాయదుర్గంలో సీఎం కేసీఆర్(cm kcr) భూమి పూజ చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి శంషాబాద్ వరకు మెట్రోను విస్తరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 31 కిలోమీటర్ల మేర రూ.6,250 కోట్లతో ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త మెట్రో లైన్ రాయదుర్గం(rayadurgam) మెట్రో స్టేషన్ నుంచి శంషాబాద్ వరకు 31 కిలోమీటర్లు విస్తరించనున్నారు. అందులో భాగంగా మైండ్ స్పేస్, గచ్చిబౌలి, నానక్ రాం గూడ జంక్షన్, ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ వరకు ఈ మెట్రో సేవలను అందించేందుకు కసరత్తు చేస్తున్నారు.
మరోవైపు ప్రజలు ఎక్కువగా ప్రయాణించే మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు మెట్రోను విస్తరించాలని బీజేపీ(bjp) ఎమ్మెల్యే రఘనందన్ రావు(Raghunandan Rao) పేర్కొన్నారు. చాలా తక్కువ మంది వెళ్లే రూట్లో శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో వెయడం అనవసరమని ఆరోపించారు. సీఎం కేసీఆర్ తన స్వలాభం కోసమే ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రకటించారని విమర్శించారు.