SRCL: ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన శ్రీ వాసవి మాత జయంతి వేడుకలను చందుర్తి మండల కేంద్రంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బాశేట్టి భాస్కర్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్యుల కులదైవమైన వాసవి మాత చిత్రపటానికి పూలమాలలతో అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.