Prabash - Pawan : ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్లు బిజీగా ఉన్నాడు ప్రభాస్. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కెతో పాటు.. మధ్యలో మారుతితో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ముందుగా మారుతితో సినిమా అన్నప్పుడు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఒప్పుకోలేదు. ఆ సినిమా చేయొద్దని సోషల్ మీడియాలో వాపోయారు.
ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్లు బిజీగా ఉన్నాడు ప్రభాస్. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కెతో పాటు.. మధ్యలో మారుతితో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ముందుగా మారుతితో సినిమా అన్నప్పుడు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఒప్పుకోలేదు. ఆ సినిమా చేయొద్దని సోషల్ మీడియాలో వాపోయారు. కానీ ప్రభాస్ మాత్రం అనుకున్నది చేశాడు. చడీ చప్పుడు లేకుండా షూటింగ్ కూడా మొదలు పెట్టేశాడు. ఇప్పటికే కీలక షెడ్యూల్స్ కూడా కంప్లీట్ చేశాడు. అయినా ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైతం.. రీమేక్ మూవీని సైలెంట్‌గా మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హరి హర వీరమల్లు చేస్తున్నాడు పవన్. ఇది కంప్లీట్ అవకముందే.. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్.. సాహో డైరెక్టర్ సుజీత్‌తో ‘ఓజి’ లాంచనంగా స్టార్ట్ చేశాడు. వీటితో పాటు తమిళంలో హిట్ అయిన వినోదయ సీతమ్ రీమేక్ కూడా చేయబోతున్నాడు. అయితే రీమేక్ సినిమాలు చేయొద్దని అంటున్నారు పవన్ ఫ్యాన్స్. అందుకే ఎవరికీ తెలియకుండా.. ఈ సినిమాకు ఎప్పుడో కొబ్బరికాయ కొట్టేశారనే టాక్ ఉంది. అయినా ఈ మధ్య గ్రాండ్‌గా ఓపెనింగ్ చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి. కానీ పోస్ట్ పోన్ చేసినట్టు తెలిసింది. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మాత్రం.. డైరెక్ట్‌గా షూటింగ్‌కు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ ఉంటుందని అంటున్నారు. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో.. సాయి ధరమ్ తేజ్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అయితే ప్రభాస్, పవన్.. ఇలా అఫిషీయల్ అనౌన్స్మెంట్ లేకుండా సినిమాలు చేయడానికి.. ఓ రకంగా ఫ్యాన్సే కారణమని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఏ చిన్న అప్టేడ్ వచ్చినా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌తో పాటు ట్రోలింగ్ కూడా చేస్తుంటారు. ఇది మేకర్స్‌ను డిసప్పాయింట్ చేసేలా ఉంటుంది.. కాబట్టి షూటింగ్ అయ్యాకే అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.