RBI ఆంక్షల నేపథ్యంలో Paytm యాప్ సేవలపై వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ ఆ సంస్థ అధికారిక వివరణ ఇచ్చింది. పేటీఎం యాప్ ద్వారా అందించే దాదాపు అన్ని సేవలు ఎప్పటిలాగే నిరంతరాయంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. పేటీఎం యాప్, UPI, వాలెట్, బిల్లు చెల్లింపులు, మనీ ట్రాన్స్ఫర్, టికెట్ బుకింగ్ వంటి ఫీచర్లు ఎలాంటి అంతరాయం లేకుండా పని చేస్తాయని వెల్లడించింది.