»At Least 39 Migrants Killed In Panama Bus Crash After Crossing Darien Gap
Panama Bus Crash : ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 39 మృతి.
Panama Bus Crash : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి కొండ మీద నుంచి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 39 మంది మృతి చనిపోగా.. 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. అమెరికా సమయం ప్రకారం బుధవారం తెల్లవారుజామున పశ్చిమ పనామా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి కొండ మీద నుంచి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 39 మంది మృతి చనిపోగా.. 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. అమెరికా సమయం ప్రకారం బుధవారం తెల్లవారుజామున పశ్చిమ పనామా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
పనామాలో 60 మందికి పైగా వలసదారులతో ప్రయాణిస్తున్న బస్సు కొండపై నుండి పడిపోవడంతో 39 మంది మరణించారని ఆ దేశ అధికారులు తెలిపారు. కొలంబియా నుంచి డేరియన్ లైన్ను దాటి పనామాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని ఓ శిబిరానికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ఆస్పత్రికి తరలించారు. బాధితులు వివరాలను సేకరిస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదం సెంట్రల్ అమెరికా దేశ చరిత్రలో అత్యంత ఘోరమైనదిగా అధికారులు తెలిపారు.