»Hero Ram Pothineni Who Is Going To Hear The Marriage Chatter
Ram pothineni: పెళ్లి కబురు వినిపించబోతున్న రామ్ పోతినేని?
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. నటీనటులు పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ లిస్టులో హీరో రామ్ పోతినేని(ram pothineni) కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై హీరో మామ క్లారిటీ ఇచ్చారు.
మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవల తన ఎంగేజ్మెంట్ ఎనౌన్స్ చేసి షాకిచ్చాడు. టాలెంటెడ్ యాక్టర్ శర్వానంద్ కూడా ఇటీవల ఓ ఇంటివాడు అయ్యాడు. శర్వా కూడా తన ఎంగేజ్మెంట్ తేదీని సడెన్ గా ప్రకటించాడు. ఇప్పుడు టాలీవుడ్లో హీరోలు తమ పెళ్లి వార్తలను సడెన్ గా అనౌన్స్ చేయడం ట్రెండ్ గా మారిందని చాలామంది అనుకున్నారు. రామ్ పోతినేని(35) (ram pothineni) కూడా పెళ్లి చేసుకునే అవకాశం ఉందని చాలా మందని వార్తలు రావడం మొదలయ్యాయి.
హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తెతో రామ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అయితే కొన్ని మీడియా సంస్థలు హీరో మామ, ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ను సంప్రదించగా, అతను దానిని పూర్తిగా ఖండించాడు. రామ్(ram) కి పెళ్లి కుదరితే తాము కచ్చితంగా ప్రకటిస్తామని, వస్తున్న పుకార్లలో ఎలాంటి నిజం లేదన్నారు. ఇప్పటి వరకు పెళ్లి కుదరలేదు అని స్రవంతి రవి కిషోర్ ప్రకటించారు. ప్రస్తుతం రామ్ బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నాడని చెప్పడం విశేషం. బోయపాటి తో రామ్ చేస్తున్న సినిమా అక్టోబర్ 20 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తర్వాత పెళ్లి పై ప్రకటన చేసే అవకాశం ఉంది.