»Speculation On Vijay Devarakonda Parasuram Movie Project Title Name
Vijay devarakonda: సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్..!
హీరో విజయ్ దేవరకొండ పరశురామ్ ప్రాజెక్ట్ టైటిల్ ఖారారైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పరశురామ్‌తో విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ రెండు రోజుల క్రితం స్టైల్‌గా ప్రారంభించబడింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల దర్శకుడు పరశురామ్(parasuram)తో ఓ సినిమా మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు చేసి, లాంఛనంగా మూవీ షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, తాజాగా ఈ మూవీ పేరుపై ఇంట్రస్టింగ్ న్యూస్ చక్కర్లు చుడుతోంది. ఈ చిత్రానికి ఫ్యామిలీ స్టార్ అనే పేరు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్‌తో విజయ్ దేవరకొండ రొమాన్స్ చేస్తున్నాడు. మేకర్స్ త్వరలో రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించనున్నారు.
గతంలో విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్లో వచ్చిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. గీతాగోవిందంలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక నటించింది. ఇదిలా ఉండగా, విజయ్ దేవరకొండ ఈ ప్రాజెక్ట్‌తో పాటు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన అతని రాబోయే రొమాంటిక్ ఎంటర్టైనర్ ఖుషి సినిమా సెప్టెంబర్1, 2023న విడుదల కానుంది. విజయ్ దేవరకొండ సరసన సమంత నటిస్తోంది.